పాడేరు: దివ్యాంగ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి
ప్రత్యేక అవసరాలు గల పిల్లల(దివ్యాంగులు)పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి పీ. బ్రహ్మాజీరావు పేర్కొన్నారు. మంగళవారం ప్రధానోపాధ్యాయులు, ఐసీడీఎస్ సిబ్బందితో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం నిర్వహించారు. దివ్యాంగులు పుట్టిన వెంటనే ఎలా గుర్తించాలి, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు ఎలా వర్తింపజేయాలి, ఇతర ప్రయోజనాలు అందించడంపై అవగాహన కల్పించారు. సదరం శిబిరాలకు దరఖాస్తు చేసుకోవడాన్ని వివరించారు.