విఎండిఎ సారధ్యంలో పిఠాపురం కాలనీలోని కళాభారతి ఆడిటోరియంలో శనివారం సాయంత్రం విశ్వవిఖ్యాత క్లారినెట్ విద్వాంసులు
డాక్టర్ ఏకెసి నటరాజన్(94) కు "నాద విద్యా భారతి" బిరుదు మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు, వైస్ అడ్మిరల్ సురేష్ పెందార్కర్ ప్రదానం చేశారు. కళాభారతి అధ్యక్షులు ఎంఎస్ఎన్ రాజు స్వాగత ఉపన్యాసం పిమ్మట మిజోరం గవర్నర్ డాక్టర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ కళలకు పట్టుకొమ్మ కళాభారతన్నారు.