జిల్లా ఎస్పీ ఉత్తర్వులు మేరకు గొలుగొండ మండలం కృష్ణదేవిపేట ఎస్సై వై. తారకేశ్వరరావు ఆధ్వర్యంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగు అనుమానిత ప్రాంతాల్లో డ్రోన్ ద్వారా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నేరాల నియంత్రణకు ఈ డ్రోన్లు సహాయపడతాయన్నారు. గంజాయి అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు డ్రోన్లు దోహదపడతాయని ఎస్సై శుక్రవారం తెలిపారు.