ఏపీ ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓఎస్ఈ అధికారిగా విశాఖ కార్యాలయంలో కింజరాపు ప్రభాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ శాఖలోనైనా అవకతవకలు జరిగినా, ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నులు చెల్లించకపోయినా ప్రభుత్వానికి నివేదికలు పంపి లోటు పాట్లపై నియంత్రణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరేలా చర్యలు చేపడతామన్నారు.