ప.గో జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన కారు
తణుకు మండలం వెంకటరాయపురం ఆంధ్ర సుగర్స్ వద్ద ఉన్న కాలువలోకి శనివారం ప్రమాదవశాత్తు ఓ కారు దూసుకెళ్లింది. కారులో తండ్రీ కూతురు చిక్కుకోగా రాంబాబు అనే యువకుడు ప్రాణాలకు తెగించి కాలువలో దూకి అద్దాలు పగలగొట్టి వారిని వెలికి తీశారు. వెంకటరాయపురానికి చెందిన వారు విజయదశమి పురస్కరించుకొని మండపాక యల్లారమ్మ దేవాలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.