విద్యుత్ బైకులు, కార్లకు జీవిత పన్ను (లైఫ్ టాక్స్) మినహాయింపు అవకాశాన్ని జిల్లాలో నూతన విద్యుత్ వాహన కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని ప. గో. జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019కి ముందు విద్యుత్ వాహనాలు కొనుగోలుపై అమలు కాబడిన జీవిత పన్ను మినహాయింపు ప్రభుత్వం జనవరి 2025 నుంచి అమలులోకి తీసుకొచ్చిందన్నారు. జనవరి 2025 నుంచి 2030 వరకు అమలులో ఉంటుందన్నారు.