కాళ్ళ: అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
కాళ్ళ మండలం కోపల్లె గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్లు మరియు డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 20 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.