ఉరవకొండ: పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ మేళా
ఉరవకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో డాక్టర్స్ రెడ్డీస్ గ్రూప్స్, క్రెడిట్ ఆక్సిస్ గ్రామీన్ కంపెనీలు పాల్గొన్నాయి. జాబ్ మేళాలో 60 అభ్యర్థులు పాల్గొనగా 35 మంది అభ్యర్థులకి ఉద్యోగాలు లభించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ అశ్రర్అలీ, జనరల్ హెచ్డీ నరసింహరెడ్డి, కళాశాల ప్రాంగణ నియామక అధికారి అలియాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.