
బిగ్‌బాస్-8 ఫైనల్ ఎఫెక్ట్.. హైదరాబాల్ పోలీసుల కీలక నిర్ణయం
బిగ్‌బాస్-8 గ్రాండ్ ఫినాలే ఆదివారం జరుగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. స్టూడియో వద్ద దాదాపు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గతేడాది పల్లవి ప్రశాంత్ ఘటనలో ముందస్తుగా ఈ జాగ్రత్తలు తీసుకున్నా.. పరిస్థితి అదుపుతప్పిన విషయం తెలిసిందే.