Top 10 viral news 🔥
రాష్ట్ర వార్తలు
జానీ మాస్టర్ కేసు.. వెలుగులోకి కీలక విషయాలు
అత్యాచార ఆరోపణతో అరెస్టయిన జానీ మాస్టర్ కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తున్న యువతిపై అతను నాలుగేళ్ల పాటు అఘాయిత్యానికి పాల్పడినట్లు నిర్ధారించారు. విషయం బయటకు చెబితే అవకాశాలు దొరకకుండా చేస్తానని బెదిరించి లొంగదీసుకున్నట్లు ఉప్పరపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. జానీ మాస్టర్‌తో పాటు అతని భార్య సుమలత కూడా బాధితురాలిపై ఒత్తిడి చేసేదని వెల్లడించారు.