ONGCలో 2,236 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ప్రభుత్వ రంగ సంస్థ 'ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్' (ONGC) 2,236 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, ట్రేడ్ అప్రెంటీస్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఒక ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 25. వెబ్సైట్: www.ongcindia.com