ఇజ్రాయెల్ పై ఇరాన్ క్షిపణి దాడి వీడియో
ఇజ్రాయెల్ పై జరిపిన బాలిస్టిక్ క్షిపణి దాడులకు సంబంధించిన వీడియోను ఇరాన్ విడుదల చేసింది. హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను ఇజ్రాయెల్ హతమార్చడంపై ప్రతీకారంతో ఇరాన్ మెరుపు దాడికి దిగిన విషయం తెలిసిందే. సుమారు 200పైగా క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడి తరువాత ప్రజలను ఉద్దేశించి ఇరాన్ సుప్రీం ఖమేనీ ప్రసంగిస్తూ నస్రల్లా మరణం వృథా కాదని, ఇజ్రాయెల్ మనుగడలేకుండా చేస్తామని రైఫిల్ చేతపట్టుకొని హెచ్చరించారు.