PLEASE CHECK.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా?
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులను ప్రధాని మోదీ ఇటీవల విడుదల చేశారు. పలువురు రైతుల ఖాతాల్లో రూ.2000 జమ కాగా, మరికొందరేమో జమ కాలేదంటున్నారు. ఈ-కేవైసీ కాకపోవడంతో పలువురి ఖాతాల్లో డబ్బు జమ కాలేదు. మీ బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బు జమ అయ్యిందా? లేదా? అనేది తెలుసుకోవడానికి వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు చెబుతున్నారు. వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసి స్టేటస్ చూడవచ్చని తెలిపారు. వెబ్సైట్: https://pmkisan.gov.in/