వనపర్తి జిల్లాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలు పకడ్బందీగా ప్రశాంతంగా ముగిసినట్లు వనపర్తి అదనపు కలక్టర్ రెవెన్యూ జి. వెంకటేశ్వర్లు తెలిపారు. అదనపు కలక్టర్ సోమవారం వనపర్తి పట్టణంలోని అనూస్ అకాడమీ స్కూల్లో నిర్వహిస్తున్న పరీక్ష కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలక్టరేట్ కంట్రోల్ రూమ్ నుండి పరీక్షలను పర్యవేక్షించారు.