మక్తల్
నర్వ: సభ్యత్వ నమోదుకు మంచి ఆదరణ లభిస్తోంది
గ్రామాల్లో, పట్టణాల్లో బీజేపీ సభ్యత్వ నమోదుకు మంచి ఆదరణ లభిస్తోందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం నర్వ మండలం శ్రీపురం గ్రామంలో బీజేపీ ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పార్టీ విధానాలు ప్రజలకు వివరించి సభ్యత్వాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.