మలక్ పేట: ఓకే ట్రాక్ మీదకు 2 రైళ్లు..
మలక్ పేట రైల్వేస్టేషన్ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. ఒకేట్రాక్ మీదకు 2లోకల్ ట్రైన్లు ఎదురెదురుగా వచ్చాయి. గమనించిన లోకోపైలట్లు వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో రైళ్లను కొద్ది దూరంలో నిలిపివేశారు. సమాచారం అందుకున్న దక్షిణమధ్య రైల్వే అధికారుల బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పరిస్థితిని సమీక్షించి రైళ్లకు రూట్ క్లియర్ చేసి వేర్వేరుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.