చిలకలగూడ పీఎస్ పరిధిలో వివాహిత మహిళ అదృశ్యమైంది. ఎస్ఐ వి జ్ఞానేశ్వర్ తెలిపిన వివరాలు. మైలర్ గడ్డకు చెందిన వి వి వి రామదుర్గాచారి, శ్రీవాణి దంపతులు. ఈనెల 23న దంపతులు ఇద్దరు గొడవపడ్డారు. ఈ క్రమంలో శ్రీవాణి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. తెలిసిన అన్ని చోట్ల వెతికినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో ఆమె కుమారుడు మోహన చారి పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.