సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. పండగ సందర్బంగా వీక్లీ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ K.సందీప్ తెలిపారు. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య 15, 22, 29వ తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నారని అయన వివరించారు. అంతేకాకుండ విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వరకు 16, 23, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. సికింద్రాబాద్ - బరహంపూర్ మధ్య 13, 20, 27వ తేదీల్లో, బరహంపూర్-సికింద్రాబాద్ మధ్య 14, 21, 28 తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అయన వివరించారు.