హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు.. కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం చాదర్‌ఘాట్‌లో ఓ ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నాణ్యత లేని అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు అందులో ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేసి కల్తీ చేస్తున్నట్లు గుర్తించారు. కుళ్లిపోయిన వెల్లుల్లి పేస్ట్‌లో అల్లంకి బదులు ఎసిటిక్ యాసిడ్ మిక్స్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.