హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు
మహారాష్ట్రలో 6 గ్యారంటీల పేరుతో సీఎం రేవంత్ మోసం చేసే ప్రయత్నం చేయగా, ఆ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను తిప్పికొట్టారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అబద్దాలు ఆడటంలో సీఎంకు డబుల్ పీహెచ్ఎ, డాక్టరేట్లు ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైన రేవంత్, మంత్రులు బుద్ధి తెచ్చుకుని ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. బోగస్ మాటలు, ఢిల్లీకి మూటలు బంద్ పెట్టాలని విమర్శించారు.