మధిర: బీఆర్ఎస్ పోరాటం వల్లే విద్యుత్ చార్జీలను పెంచలేదు

81చూసినవారు
మధిర: బీఆర్ఎస్ పోరాటం వల్లే విద్యుత్ చార్జీలను పెంచలేదు
బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటం వల్లే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలను పెంచలేదని నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి లింగాల కమల్ రాజు అన్నారు. బుధవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు మధిర మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ నందు సంబరాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలపై రూ. 18, 500 కోట్ల భారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆపిందని అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచకుండా అడ్డుకున్న కేసీఆర్ పేదల పక్షాన ఉన్నారని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్