ఇల్లందు: కోమరారం పీహెచ్ సీలో సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ
ఇల్లందు మండలం కోమరారం పీహెచ్సీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పిఓడబ్ల్యూ, పీవైఎల్ పార్టీ నాయకులు ర్యాలీ తీసి, ఆసుపత్రి ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. పీవైఎల్ గ్రామ శాఖ అధ్యక్షుడు బి, రమేష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు సావిత్రి, ముత్తక్క, దేవా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆసుపత్రి సమస్యలపై మంత్రి, ఎమ్మెల్యేకు విన్నవించినా, పట్టించుకోవడం లేదన్నారు.