ఇల్లందు: విలీన సభను జయప్రదం చేయాలని పిలుపు
ఈనెల 28న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ విలీన సభను జయప్రదం చేయాలని ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లో పోస్టర్ ఆవిష్కరించారు. 2013లో వివిధ కారణాల రీత్యా విడిపోయిన న్యూ డెమోక్రసీ పార్టీలు నేడు విలీనం అవ్వాలనుకోవడం శుభపరిణామం అని రాష్ట్ర కార్యదర్శి ఆవునూరి మధు మంగళవారం అన్నారు. దేశంలో మతోన్మాద బీజేపీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలు అవలంబిస్తుందన్నారు.