ఇల్లందు: లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన ఆదేశాల మేరకు పలువురికి మంజూరైన సిఎమ్అర్ఎఫ్ చెక్కులను మంగళవారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వైస్ ఎంపీపీ మండల రాము మాట్లాడుతూ నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పద్మ, మాజీ ఎంపీటీసీ పునేం సురేందర్, ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.