శ్రీరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
AP: టీడీపీ నేతలపై సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసినందుకు సినీ నటి శ్రీరెడ్డిపై గుడివాడ వన్‌టౌన్ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనితపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టి.. వారి ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్న శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ మచిలీపట్నం సామాజిక మాధ్యమాల కన్వీనర్ నిర్మల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.