ముథోల్
ఆటో బోల్తా బాలుడు మృతి
అదుపు తప్పి ఆటో బోల్తా పడి బాలుడు మృతి చెందిన ఘటన శనివారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం భైంసా పట్టణ కేంద్రంలోని కిషన్ గల్లీకి చెందిన సాయినాథ్ కుటుంబ సభ్యులతో కలిసి తానూర్ లోని బంధువుల ఇంటికి ఆటోలో వెళ్తుండగా మంజరి గ్రామం వద్ద అదుపు తప్పి ఆటో బోల్తా పడగా, వశికర్ (11) మృతి చెందగా, ముగ్గురికి స్వల్ప గాయాలయినట్లు తెలిపారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.