కులగణనతో ఏ పథకం రద్దు కాదు: CM రేవంత్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన వల్ల ఏ ఒక్క సంక్షేమ పథకం రద్దు కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చిల్డ్రన్స్ డే వేడుకల సందర్భంగా మాట్లాడుతూ.. ఈ సర్వే ఒక మెగా హెల్త్ చెకప్ లాంటిదన్నారు. జనాభా ప్రకారం రిజర్వేషన్లు అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా కులగణన జరగాలని చెప్పారు. కొంత మంది కావాలనే సర్వేపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.