మహిళా సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు: సీతక్క
తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు(SHG) మంత్రి సీతక్క గుడ్ న్యూస్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో SHGలకు 1,000 మేగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి సీతక్క ఆదేశాలతో ఇంధన కార్యదర్శికి ప్రతిపాదనలు పంపించారు. మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు కేటాయిస్తే అనువైన భూములను గుర్తించి, మహిళా సంఘాలకు/ సమాఖ్యలకు లీజుకు భూములను ఇప్పిస్తామని వెల్లడించారు. దీంతో ఏడాదికి రూ. 30 లక్షల ఆదాయం లభించే అవకాశం ఉందని చెప్పారు.