గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షలు సోమవారం నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఈనెల 21 వ తేదీ నుంచి 27 వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.