కొత్తగూడెం: తోటి కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సహాయం
ఇటీవల మృతి చెందిన కొత్తగూడెంకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి కుటుంబానికి 2000 బ్యాచ్ కానిస్టేబుల్స్ 5. 2 లక్షల సాయాన్ని చెక్కు రూపంలో ఎస్పీ బి. రోహిల్రాజు చేతుల మీదుగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు, 15 మంది కానిస్టేబుల్స్ పాల్గొన్నారు.