ఇల్లందు: మహిళలకు భద్రత లేకుండా పోతుంది
దేశం, రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఐద్వా జిల్లా కార్యదర్శి మండలపు జ్యోతి అన్నారు. శనివారం ఇల్లెందులో ఐద్వా ఆధ్వర్యంలో మహిళలపై దాడులు అరికట్టాలని నిరసన వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో మహిళలకు భద్రత లేకుండా పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేటి సంధ్య, కాంతమ్మ, పద్మ పాల్గొన్నారు.