సీఎం సహాయనిధి చెక్కు అందించిన మంత్రి
ఇల్లందు కారేపల్లికి గ్రామానికి చెందిన పొట్లకాయల వెంకటేశ్వర్లుకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్య చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం సహాయ నిధి ద్వారా అండగా నిలిచారు. వారి వినతికి స్పందించిన మంత్రి సీఎం సహాయనిధి ద్వారా రూ. 4 లక్షల 50 వేలు ఎసిని బాధిత కుటుంబానికి అందించారు.