అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత
ఇల్లందులో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులను ఖండిస్తూ, కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. అరెస్టులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. ప్రజా పాలన ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం నియంత పాలన కొనసాగిస్తుందని ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు.