జడ్చర్ల: స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ గెలుపు కృషి చేయాలి
జడ్చర్ల నియోజకవర్గం ఉర్కొండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ద్యాప వీరారెడ్డి ఆధ్వర్యంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డా. చెర్లకొళ లక్ష్మారెడ్డి అధ్యక్షతన సోమవారం బిఆర్ఎస్ పార్టీ ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల, గెలుపుకు, నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.