నిర్వాసితులపై కపట ప్రేమ చూపుతున్న కాంగ్రెస్
ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులపై కాంగ్రెస్ కపట ప్రేమ చూపిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్ల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, దానిని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన హామీ మేరకు రెండు పడక గదుల ఇండ్లు, ఇంటి స్థలాలు, వివిధ ప్యాకేజీలు వర్తింపజేసినట్లు స్పష్టం చేశారు.