సిద్దిపేట, గజ్వేల్ రైల్వేస్టేషన్లకు బస్సు సౌకర్యం కల్పించాలి
మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ ను త్వరగా పూర్తి చేయడంతో పాటు సిద్దిపేట, గజ్వేల్లోని రైల్వే స్టేషన్లకు బస్సు సౌకర్యం కల్పించాలని లోక్ సత్తా ఉద్యమ సంస్థ ఉభయ తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త బండారు రామ్మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా చోట్ల రైల్వేస్టేషన్లకు బస్సు సౌకర్యం ఉన్నా, గజ్వేల్, సిద్దిపేటలో లేకపోవడం దురదృష్టకరమన్నారు.