కొండమల్లేపల్లి ఎన్ఎంఎంఎస్ 2024-25 నవంబర్ 24న జరగబోయే పరీక్ష ఎంతో ప్రాముఖ్యత కలిగినదని జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలరాజు రెడ్డి, ఎంఈఓ నాగేశ్వర్ రావు, పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.