దేవరకొండ: తొమ్మిది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
దేవరకొండ మాల్ వ్యవసాయ మార్కెట్ పరిధిలోని పత్తి రైతులు పండించిన పత్తిని కోనుగోలు చేయుటకు సిసిఐ 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ఆర్డీఓ శ్రీరాములు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, తేమ శాతం 8 నుండి 12 లోపు ఉన్న పత్తి మాత్రమే కోనుగోలు చేస్తారని, రైతులు పత్తిని అరబెట్టుకొని మీ మండల వ్యవసాయ అధికారుల వద్ద తేమ శాతం నిర్ధారించుకుని దగ్గర్లోని సిసిఐ కేంద్రంలో విక్రయించాలని తెలిపారు.