సంక్రాంతి కానుకగా మైనారిటీ మహిళలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్(TGMFC) ఇందిరమ్మ మహిళా పథకం ద్వారా మైనారిటీ మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు ఇవ్వనుంది. 2024 డిసెంబర్ 16 నుంచి 31 వరకు టీజీఎంఎస్సి వెబ్సైట్లో దరఖాస్తు చేసి జిల్లా మైనార్టీ శాఖ అధికారికి సమర్పిస్తే చాలని ప్రకటించింది. కుట్టుమిషన్లు మహిళలకు సంక్రాంతి కానుకగా అందజేయనున్నట్లు సమాచారం.