దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని చింతపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించి పోలీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు, పోలీసు స్టేషన్ పరిసరాలు, స్థితిగతులు గురించి శుక్రవారం నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్, స్టేషన్ రైటర్, లాక్ అప్, యస్. హెచ్. ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు మండల స్థాయిలో సమస్యలు పరిష్కరించేలా చూడాలన్నారు.