
సూర్యాపేట: పోరుగర్జనకు తరలిరావాలి
ఏప్రిల్ రెండవ తేదీన ఢిల్లీలో నిర్వహించే బీసీల పోరుగర్జనకు తరలిరావాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలో బీసీ గర్జన గోడపత్రికను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసిన బీసీల 42% రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దాసరి వెంకన్న, సుదర్శన్, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.