Dec 02, 2024, 17:12 IST/నిర్మల్
నిర్మల్
నిర్మల్: ముగిసిన ప్రైవేట్ పాఠశాలల కబడ్డీ పోటీలు
Dec 02, 2024, 17:12 IST
నిర్మల్ జిల్లా ట్రస్మా (ప్రైవేట్ స్కూల్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు సోమవారం సాయంత్రంతో ముగిసాయి. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో గత మూడు రోజుల నుండి నిర్వహించిన కమిటీ పోటీలలో జేవిఎన్ఆర్ పాఠశాల ఫైనల్ పోటీలో గెలుపొంది బంగారు పతకం సాధించారు. విజేతలకు ట్రస్మా జిల్లా అధ్యక్షుడు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.