ఆలూరు మండల స్థాయి కాంప్లెక్స్ సమావేశం

62చూసినవారు
ఆలూరు మండల స్థాయి కాంప్లెక్స్ సమావేశం
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆలూరు ఆవరణలో జరిగిన మండల ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశానికి మండల విద్యాశాఖాధికారి నరేందర్ హాజరై ప్రసగించారు. మండలం పరిథిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు ఈ నెల అఖరిలోగా మిడ్ లైన్ టెస్టులు నిర్వహించాలని, విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలన్నారు. అలాగే పాఠశాలకు సమయపాలన విద్యార్థులలో క్రమ శిక్షణను పెంపొందించాలని అన్నారు. అనంతరం పి ఆర్ టి యు ఆధ్వర్యంలో ఎంఈవోను సన్మానించారు.

సంబంధిత పోస్ట్