తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహం "తెలంగాణ అమ్మ కాదు కాంగ్రెస్ బొమ్మ" అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సోమవారం విమర్శించారు. గత రాష్ట్ర ప్రభుత్వం పాలనలోని తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపు రేఖలు మారుస్తూ నేడు ఆవిష్కరించనున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను ఆయన తీవ్రంగా ఖండించారు.