వృధాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు వృధాగా పోతున్నాయి. గ్రామంలోని ఎస్సీ వాడాలో మిషన్ భగీరథ పైపు లైను పగిలింది. దీంతో నీళ్లు రోడ్లపై ప్రవాహించడంతో కాలనీ వాసులు ఇబ్బందులు పడ్డారు. వృధాగా నీళ్లు పోతుండటంతో గ్రామస్థులకు సరిపడా నీళ్లు అందడం లేదని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి వృధాను అరికట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.