జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శాసనమండలిలో సోమవారం కవిత మాట్లాడారు. రైతులను మల్బరీ సాగు వైపు ప్రోత్సహించాలని చెప్పారు. ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్లడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు నిధులు ఏం తీసుకొచ్చారు’’ అని కవిత ప్రశ్నించారు.