జూబ్లీహిల్స్: సీఎం సహాయనిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా విరాళం
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. కోటి విరాళం అందజేసింది. గురువారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో, బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఏంవీఎస్ సుధాకర్ మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయార్థం ముందుకు వచ్చి విరాళం అందించినందుకు సీఎం వారికి కృతజ్ఞతలు తెలిపారు.