ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డు నుచ్చుగుట్ట తండాలో సోమవారం ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పరిశీలించి లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు కమిషనర్ వసంత తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు లక్ష్మీ, చందు నాయక్, రఘు, రజిత, నాయకులు కృష్ణ నాయక్ పాల్గొన్నారు.