తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని సోమవారం జేఏసీ నాయకులు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అనంతరం మాట్లాడుతూ మండల కేంద్రం ఏర్పాటుకు తమ గ్రామం గణాంకాల ప్రకారం అన్ని అర్హతలు ఉన్నాయని, పాలన సౌలభ్యం కోసం మండల కేంద్రంగా ప్రకటించాలని వారు కోరారు.