బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును బీఆర్ఎస్వీ షాద్ నగర్ నియోజకవర్గం అధ్యక్షులు శీలం శ్రీకాంత్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, షాద్ నగర్ నియోజకవర్గం పరిణామాలను అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని అన్నారు.